Monday, December 23, 2024

ఎస్ బ్యాంక్ డిహెచ్‌ఎఫ్‌ఎల్ కేసు… ఇద్దరు బిల్డర్ల ఆస్తుల జప్తు

- Advertisement -
- Advertisement -

Yes Bank-DHFL fraud case

 

న్యూఢిల్లీ : ఎస్ బ్యాంక్‌డిహెచ్‌ఎఫ్‌ఎల్ బ్యాంకు రుణాల అవకతవకలకు సంబంధించిన మనీ లాండరింగ్ కేసుల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) వేగం పెంచింది. మహారాష్ట్ర బిల్డర్లు అవినాష్ భోసలే , సంజయ్ ఛాబ్రియా నుంచి రూ. 415 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ బుధవారం జప్తు చేసింది. గత జూన్‌లో ఈ ఇద్దరు బిల్డర్లను ఈడీ కస్టడీ లోకి తీసుకోగా, ప్రస్తుతం వారు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. భోసలేకు చెందిన రూ. 164 కోట్ల ఆస్తులు, ఛాబ్రియాకు చెందిన రూ.251 కోట్ల ఆస్తులు జప్తు చేసేందుకు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ప్రొవిజనల్ అటాచ్‌మెంట్ ను ఈడీ మంగళవారం నాడు జారీ చేసింది. ఛాబ్రియా నుంచి ఈడీ స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో శాంతాక్రూజ్‌లో రూ. 116 కోట్ల విలువ చేసే ఒక ప్లాట్, ఢిల్లీ ఎయిర్‌పోర్టు వద్ద చాబ్రియాకు చెందిన హోటల్ ప్రాఫిట్ రూపం లోని రూ.13.67 కోట్లు, రూ. 3.10 కోట్ల విలువ చేసే లగ్జరీ కార్లు ఉన్నట్టు ఈడీ ప్రకటనలో తెలిపింది. కాగా పుణె వ్యాపారి అవినాష్ భోసలే నుంచి జప్తు చేసిన ఆస్తుల్లో ముంబై లోని రూ. 102.8 కోట్ల విలువ చేసే డ్యూప్లెక్స్ ఫ్యాట్, పుణె లోని రూ. 14.65 కోట్ల విలువైన భూమి, నాగపూర్ లో రూ. 15.52 కోట్ల విలువైన చిన్న స్థలం, నాగపూర్‌లో మరో చోట రూ.1.45 కోట్ల విలువైన భూమి ఉన్నాయని ఈడీ వర్గాలు తెలిపాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News