Thursday, January 23, 2025

అవును… ఇది ఈడీ ప్రభుత్వమే : ఫడ్నవీస్

- Advertisement -
- Advertisement -

Yes... This is the ED government: Fadnavis

ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష జరుగుతున్న సమయంలో విపక్ష ఎమ్‌ఎల్‌ఎలు ఈడీఈడీ అంటూ అరిచారు. ఉద్ధవ్ వర్గంలోని శివసేన ఎమ్‌ఎల్‌ఎలు సీఎం ఏక్‌నాథ్‌కు మద్దతు ఇవ్వడాన్ని నిరసిస్తూ విపక్షాలు నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వాన్ని మార్చేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను బీజేపీ వాడుకున్నట్టు విపక్షాలు ఆరోపించాయి. అయితే విశ్వాస పరీక్షలు ఏక్‌నాథ్ నెగ్గిన తరువాత మాజీ సీఎం ఫడ్నవీస్ అసెంబ్లీలో మాట్లాడారు. తమది ఈడీ ప్రభుత్వమే అని, ఈడీ అంటే ఏక్‌నాధ్ దేవేంద్ర ప్రభుత్వమని తనదైన రీతిలో విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. బీజేపీశివసేన కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచినా , తమ వద్ద మెజారిటీని విపక్షం లాక్కెళ్లినట్టు ఆరోపించారు. బీజేపీనీ కాదని, కాంగ్రెస్, ఎన్‌సిపీతో ఉద్ధవ్ పొత్తు కట్టడాన్ని ఫడ్నవీస్ తప్పుపట్టారు. ఏక్‌నాథ్‌ను కలుపుకుని మరోసారి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, శివసైనికుడే సీఎం అయ్యారని ఫడ్నవీస్ పేర్కొన్నారు. తమ పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం తాను డిప్యూటీ సీఎం అయినట్టు ఫడ్నవీస్ తెలిపారు. గతంలో తమ పార్టీ తనను సీఎం చేసిందని, ఇప్పుడు ఇంటివద్ద ఉండమన్నా ఉండేవాడినన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News