Monday, December 23, 2024

అవును.. ఐదు గంటలే కరెంటు ఇస్తున్నాం

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్/ తాండూరు: కర్ణాటకలో వ్యవసాయ రంగానికి 5 గంటల కరెంట్ ఇస్తు న్నామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మే రకు 5 హామీలను అమలు చేస్తున్నా మని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ పేర్కొన్నారు. వికారాబా ద్ జిల్లాలోని తాండూర్ నుం చి రెండో విడత కాంగ్రెస్ విజయభేరి బస్సుయా త్రను హస్తం పార్టీ ప్రారం భించింది. ఈ నేపథ్యంలో యాత్రలో పాల్గొన్న డి కె శివకుమార్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పట్ల కృతజ్ఞత చూపాలని, కాంగ్రెస్ పార్టీ ఏదైనా హామీ ఇచ్చిందంటే దానిని తప్పక నెరవేరుస్తుందని  చెప్పారు. రాష్ట్ర ప్రజల మీద ప్రేమతో సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పట్ల కృతజ్ఞత చూపాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి శివకుమార్ కోరారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే పేదల గురించి ఆలోచిస్తుందన్నారు. డిసెంబరు 9వ తేదీన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన జోస్యం చెప్పారు. కర్ణాటకలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ వివరించారు. అలాగే గృహలక్ష్మి పథకం ద్వారా 1.10 కోట్ల మంది మహిళలకు నెలకు రూ.2 వేలు అందిస్తున్నామన్నారు. అక్కడ హామీ ఇచ్చిన ప్రకారం పేదలకు 10 కిలోల సన్న బియ్యం ఉచితంగా ఇస్తున్నామని, కర్ణాటకలో మహిళలందరూ ఆర్టీసి బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్నారన్నారు.

అదే విధంగా తెలంగాణలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అధికారంలోకి రాగానే కచ్చితంగా అమలు చేసి తీరు తామని ఆయన స్పష్టం చేశారు. ఈ యాత్ర తాండూర్, పరిగి, చేవెళ్ల మీదుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో తాండూరు కాంగ్రెస్ అభ్యర్థి మనోహర్‌రెడ్డి, మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్‌కుమార్, పుష్ప లీల, జిల్లా పార్టీ అధ్యక్షుడు రాంమోహన్‌రెడ్డి, ఎఐసిసి సభ్యులు ఖాన్ సాబ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాల్వ ధారాసింగ్, లకా్ష్మరెడ్డి, డా. సంపత్‌కుమార్, సునీత బుయ్యని శ్రీనివాస్‌రెడ్డి, వికారాబాద్ జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అమెర్ అబ్దుల్లా ,రాకేశ్ మహారాజ్, మహిపాల్‌రెడ్డి, తాండూరు నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News