Thursday, December 19, 2024

భార్య మర్మాంగాలపై కత్తితో పొడిచి… హత్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: భార్య తన మేనల్లుడితో అక్రమ సంబంధం పెట్టుకుందనే అనుమానంతో ఆమె మర్మాంగాల వద్ద చాకుతో భర్త పొడిచి చంపిన సంఘటన కర్నాటక రాష్ట్రం యశ్వంత్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. బసవేశ్వర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మంజునాథ నగర్‌లో అయప్ప-నాగరత్నం అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు భూమిక, కుమార్ అనే పిల్లలు ఉన్నారు. నాగరత్నం బట్టల షాపులో పని చేస్తు ఉండగా అయప్ప కూలీ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు.

Also Read: స్నేహితుడి ప్రాణం తీసిన చికెన్ ఫ్రై

గత కొన్ని రోజుల నుంచి భార్య ఫోన్లో మాట్లాడుతుండడంతో ఆమెపై భర్తకు అనుమానం కలిగింది. ఒక రోజు ఇంటికి వచ్చేసరికి భార్య అయ్యప్ప అక్క కుమారుడు చందుతో సన్నిహితంగా ఉన్నాడు. దీంతో నువ్వు ఎందుకు వచ్చావని చందుతో గొడవకు దిగాడు. అప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గొడవలు తారాస్థాయికి చేరుకోవడంతో మూడు రోజుల క్రితం భార్యతో భర్త గొడవకు దిగాడు. ఆమెపై కత్తితో దాడి చేసి మర్మాంగాల వద్ద కత్తితో పొడవడంతో ఆమె ఘటనా స్థలంలోనే చనిపోయింది. గ్రామస్థుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News