Sunday, December 22, 2024

తాగకుండానే డ్యాన్స్ చేస్తా!…

- Advertisement -
- Advertisement -

ముంబై: ‘ర్యాపర్’  యో యో హనీ సింగ్ విమానాశ్రయంలో పపరాజ్జీలకు చిక్కాడు. పపరాజ్జీలు వెంట పడి ఫోటోలు తీయడం, ప్రశ్నలతో వేధించడం చేస్తుంటారు. అయితే యో యో హనీ సింగ్ మాత్రం పపరాజ్జీలతో సంతోషంగా మాట్లాడాడు. అతడు సోనాక్షి సిన్హాకి మంచి స్నేహితుడు.

ఓ పపరాజ్జీ ఆ వీడియోలను షేర్ చేశాడు. హనీ అక్కడక్కడ నెరిసిన గడ్డం, జుట్టుతో కనిపించాడు. పైగా హాఫ్ షర్ట్, నిక్కర్ వేసుకుని మరీ కనిపించాడు.

ఒకానొక వీడియోలో పపరాజ్జీలు అతడిని సోనాక్షి సిన్హా, జహీర్ ఇక్బాల్ పెళ్లి గురించి ప్రశ్నించగా,  ‘‘ తాగకుండానే నేను డ్యాన్స్ చేస్తా’’ అని బదులిచ్చి వారిని నవ్వించాడు.

యో యో హనీ, సోనాక్షి కలిసి 2014లో ‘దేశీ కళాకార్’, దాని సీక్వల్ గా 2023లో ‘కళాస్టార్’ హిట్ సాంగ్స్ నిర్మించారు.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News