Thursday, January 23, 2025

ఉత్సాహంగా సైక్లోథాన్‌

- Advertisement -
- Advertisement -

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా అమీర్‌పేట్‌లోని యోద డయాగ్నస్టిక్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం జరిగిన సైక్లోథాన్‌ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ బైస్కిల్‌ క్లబ్‌ సభ్యులతో పాటు సంస్థ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. 22 కిలోమీటర్ల మేర సాగిన ఈ సైక్లోథాన్‌ను డయాగ్నస్టిక్‌ సంస్థ చైర్మన్‌ కంచర్ల సుధాకర్‌ జెండా ఊపి ప్రారంభించారు. అమీర్‌పేట్‌ నుంచి ప్రారంభమైన ఈ సైక్లోథాన్, బేగంపేట, సోమాజిగూడ, ఖైరతాబాద్, ట్యాంక్‌బండ్, నెక్లెస్‌ రోడ్డు మీదుగా కొనసాగింది.

Yoda Diagnostics Conduct World Health Day Cyclothonబైస్కిల్‌ క్లబ్‌ మెంబర్లతో పాటు సంస్థ ఉద్యోగులు 200 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్‌ సుధాకర్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధగా ఉండాలని శరీరానికి అవసరమైన ఆహార పదార్థాలను తీసుకోవడంతో పాటు శారీరక వ్యాయామం తప్పనిసరిగా చేయాలన్నారు. ఆరోగ్యంపై అందరికీ అవగాహన కల్పించేందుకు తాము ఈ సైక్లోథాన్‌ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్‌ బైస్కిల్‌ క్లబ్‌ అధ్యక్షుడు రవీందర్, సంస్థ ఎండీలు రఘు, వెంకట్, గౌతం, సీవోవో డాక్టర్‌ కిరణ్‌కుమార్, ల్యాబ్‌ డైరెక్టర్‌ మహేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News