Thursday, January 23, 2025

ఇండియన్ రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం

- Advertisement -
- Advertisement -

లింగంపేట్ : ప్రపంచ యోగా దినోత్సం సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ లింగంపేట్ మండల శాఖ ఆధ్వర్యంలో బుధవారం కాకతీయుల నాటి చారిత్రక కట్టడం నాగన్న బావిలో 100 మంది కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాల విద్యార్థినీలతో యోగా దినోత్సవం నిర్వహించారు.

ఈసందర్భంగా మండల ఐఆర్ సియస్ అధ్యక్షుడు బోల్లు శ్రీకాంత్ మాట్లాడుతూ ప్రపంచ వారసత్వ సంపద అయిన నాగన్న గారి మెట్ల బావిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ గారి ప్రత్యేక చొరవతో బావి పునరుద్దరణ కార్యక్రమం జరుగుతుందని నాగన్న బావికి పర్యాటక కేంద్రంగా ప్రాచూర్యం పొందాలనే ఉద్దేశంతో ఇక్కడ గతంలో యోగా దినోత్సవం నిర్వహించి ట్విట్టర్ లో పోస్టు చేయగా మంత్రి కేటీఆర్ స్పందించి నాగన్న బావిని త్వరలో పర్యాటక కేంద్రంగా చేస్తామని చెప్పారని గుర్తు చేశారు.

ప్రస్థుతం బావి పునరుద్దరణ పనులు త్వరిత గతిన జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ వాసంతి, ఐఆర్‌సిమస్ సభ్యులు బట్టు సాయిలు, సునీల్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News