Monday, December 23, 2024

అసోంలో యోగా ఆసుపత్రి

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అసోంలోని దిబ్రూగర్‌లో 100 పడకల యోగా ప్రకృతి చికిత్స ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆయుషు మంత్రి సర్బానంద సోనోవాల్ శుక్రవారం తెలిపారు. ఈశాన్య ప్రాంతంలో యోగా ఇతరత్రా సహజసిద్ధ ప్రక్రియలతో ఆరోగ్య వృద్ధి దిశలో ఈ ఆసుపత్రి ప్రధాన భూమిక పోషిస్తుందని వివరించారు. యోగా మహోత్సవ్ నేపథ్యంలో మంత్రి ఈ ఆసుపత్రి ఏర్పాటు గురించి వెల్లడించారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముందస్తు కార్యక్రమాలలో భాగంగా ఇక్కడ శుక్రవారం యోగా మహోత్సవం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News