హైదరాబాద్: యోగం అంటే సాధన చేయడమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడారు. యోగా అంటే ఏకాగ్రతను సాధించడమన్నారు. యోగా ప్రాచీనమైనదనీ ఎప్పటికీ కాలదోషం పట్టనిది అని స్పష్టం చేశారు. యోగా ఆత్మవిశ్వాసం కల్పిస్తుందన్నారు. కుల మతాలకు అతీతమైనది యోగా అని, యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక అని వెంకయ్యనాయుడు మండిపడ్డారు. యోగా ప్రపంచ దేశాల్లో శాంతికి దోహదం చేస్తుందన్నారు. దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే యోగా చేయాలని పిలుపునిచ్చారు. ఏ స్థాయిలో ఉన్న యోగా తప్పనిసరి అని, కొంత సమయం యోగా చేస్తే ఆరోగ్యానికి మంచిదని, పెద్దలు అందించిన యోగాను జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. యోగా దినోత్సవంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, నటుడు అడవి శేషు, బాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు పాల్గొన్నారు.
యోగా భారతీయ సంస్కృతికి ప్రతీక: వెంకయ్యనాయుడు
- Advertisement -
- Advertisement -
- Advertisement -