Monday, December 23, 2024

మానసిక ప్రశాంతతకు యోగా దివ్య ఔషదం

- Advertisement -
- Advertisement -

జవహర్‌నగర్ : మానసిక ప్రశాంతతకు యోగా దివ్య ఔషదంగా పని చేస్తుందని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ అన్నారు. బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకోని జీబీర్ స్పోర్ట్ సెంటర్‌లో రణవీర్ తైక్వాండో అకాడమీ మాస్టర్ రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా క్లాస్‌లకు ఆయన హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు కనీసం గంట సమయం యోగా చేస్తే ఎలాంటి రుగ్మతలు వ్యాపించవని తెలిపారు.ఏకాగ్రతతో యోగా చేస్తే ఆరోగ్యం,మనస్సుకు ప్రశాంతత లభిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్‌టిఎ వైస్ ప్రెసిడెంట్ కొండల్ రెడ్డి,సలహాదారుడు శ్రీనివాస్‌యాదవ్,మేనేజర్ వేణు,రాంరెడ్డి,వెంకట్‌రావు,సుధాకర్‌గౌడ్,నాగిశెట్టి శ్రీనివాస్,శ్రీనివాస్‌మూర్తి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News