మాదాపూర్ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని కొండాపూర్‌లోని కెఎల్ డిమ్డ్ టు బి యూనివర్సిటీలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కెఎల్ డిమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జి పార్ద సారధి వర్మ మాట్లాడుతు యోగా మా విశ్వ విద్యాలయం యొక్క వ్యక్తిగత ఎదుగుదల, శ్రేయస్సు యొక్క సూత్రాలకు అనుగుణంగా ఉంటుందన్నారు. స్వీయ సంరక్షణ, బుద్ధ్దిపూర్వక సంస్కృతిని పెంపోందించడం మా విద్యార్ధులు విద్యాపరంగా, వ్యక్తిగతంగా రాణించగల వాతావరణాన్ని సృష్టించడం మేము లక్షంగా పెట్టుకున్నామన్నారు.
ఆరోగ్యకరమైన, సమతుల్య జీవితాలను గడపడానికి అసవరమైన జ్ఞానం, నైపుణ్యాలతో వ్యక్తులను సన్నద్ధం చేయడం మా లక్షం అన్నారు. కెఎల్ డిమ్డ్ టు బి యూనివర్సిటీ దేశంలోని ప్రధాన విద్యాసంస్ధలలో ఒకటిగా గుర్తింపు పొందిందన్నారు. విద్యా అంశాలు, పాఠ్యేతర కార్యకలాపాల మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించే శక్తివంతమైన అభ్యాస అనుభవాన్ని అందిస్తోందన్నారు. సమగ్రమైన రీతిలో విద్యార్ధి అభివృద్ధ్ది, మానవీయ విలువల పెంపకంపై బలమైన ప్రాధాన్యతతో, విశ్వవిద్యాలయం విద్యార్థులను ప్రపంచ నాయకులుగా తీర్చిదిద్దే లక్షంతో ఉందన్నారు.