Wednesday, November 13, 2024

శారీరక, మానసిక ఉల్లాసానికి యోగా తప్పనిసరి

- Advertisement -
- Advertisement -
  • ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి

మర్కుక్: యోగాతోని సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ దావాఖానాలు నూతనంగా ఏర్పాటు చేసిన యోగ షెడ్‌ను ఎంపిపి పాండు గౌడ్, జెడ్పిటిసి మంగమ్మ రామచంద్రం, వైస్ ఎంపిపి మంద బాలరెడ్డి, సర్పంచ్ భాస్కర్, డాక్టర్ శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించిన ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అనంతరం యోగాసనాల గురించి విద్యార్థులకు తెలిపి నాలుగు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యోగా అనేది శారీరక, మానసిక ఆధ్యాత్మిక సాధనను సాధించడానికి పురాతన మార్గమని ప్రధానంగా భారతదేశంలో ‘యోగా’ అనే పదం సంస్కృతం నుండి ఉద్భవించిందని, యోగా అనేది మనిషి తన మనస్సు, శరీరం ఆత్మను ఒకచోట చేర్చడానికి ప్రయత్నించే ప్రక్రియని, అందరూ ప్రతీ రోజు యోగ చేయాలని,ఆరోగ్యంగా ఉండాలని తెలియజేశారు.

యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని, పూర్వకాలం నుండి యోగ ప్రసిద్ధి పొందింది అని ప్రతిఒక్కరూ యోగ ఆసనాలు ప్రాణాయామం చేయడం అలవర్చుకోవాలని అన్నారు. అందరు యోగా దిన చర్య అలవాటు చేసుకోవాలి అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం తయారు అవుతుంది అన్నారు. రోజు 1గంట సమయం యోగా చేసి చిన్న చిన్న ఆసనాలతో మనం ఆరోగ్యాన్ని కాపాడు కోవచ్చు హాస్పిటల్ అవసరం ఉండదు, యోగా ద్వారా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది, అందరు రోజు చేయగలరని ఆశిస్తు పాల్గొన్న అందరికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కొండ పోచమ్మ దేవస్థానం డైరెక్టర్ రమేష్, ప్రభుత్వ పాఠశాల అధ్యాపకులు,విద్యార్థిని విద్యార్థులు హాస్పిటల్ సిబ్బంది,బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News