Wednesday, January 22, 2025

భారతీయ జీవన విధానం యోగా

- Advertisement -
- Advertisement -

హన్మకొండ టౌన్ : భారతీయ జీవన విధానం యోగా అని కాకతీయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ టి.శ్రీనివాసరావు అన్నారు. బుధవారం విశ్వవిద్యాలయ స్పోర్ట్స్ బోర్డు ప్రాంగణం లో విశ్వవిద్యాలయ యోగా సెంటర్, జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రపంచ యోగా దినోత్సవం వసుదైవ కుటుంబం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచేసి విద్యార్థులు, సిబ్బంది నీ ఉద్దేశించి మాట్లాడారు. రోజు వారి మన జీవనంలో యోగా భాగం కావాలి అన్నారు. లైఫ్ స్టైల్ మారుతున్నా ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనముందు ఉన్న ఒకే ఒక ప్రత్యామ్నాయం యోగా అన్నారు.

ప్రతి ఒక్కరు యోగాతో పాటు ధ్యానం పై దృష్టి పెట్టాలని అన్నారు. అధిక ఒత్తిడిల నుంచి బయటపడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి ప్రొపెసర్ పి.మల్లారెడ్డి, కాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొపెసర్ బి సురేష్ లాల్, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొపెసర్ ఎన్.ప్రసాద్, స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి ప్రొపెసర్ టి.సవితా జ్యోత్స్న, కాంపస్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ ప్రొపెసర్ వై.వెంకయ్య, డాక్టర్ మొహమద్ అసిం ఇక్బాల్, సంధానకర్తలు గా యోగ సెంటర్ సంచాలకులు ప్రొపెసర్ ఎస్.జ్యోతి, జాతీయ సేవా పథకం కోఆర్డినేటర్ ప్రొపెసర్ ఈసం నారాయణ వ్యవహరించారు.

సీఆర్పీఎఫ్ అధికారులు కమాండెంట్ ఎం.మోహన్, సెకండ్ ఇన్ కమాండెంట్ ఎం.జి నాయర్, డిప్యూటీ కమాండెంట్ కే ఎల్ తులసి, చంద్ర మోరే అనిల్, ప్రసాద్ కె.వి, ప్రజా సంబంధాల అధికారి డాక్టర్ వల్ల్లాల పృద్వీ రాజు పాల్గొనగా యోగా గురు మొగిలయ్య ను శాలువా, జ్ఞాపిక, బోకేతో సన్మానించారు. రోజు వారి యోగాసనాలు వేయించారు ధ్యానంపై అవగాహన కల్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News