Sunday, January 19, 2025

రోగాలను దూరం చేసేది యోగా

- Advertisement -
- Advertisement -

ఎల్బీనగర్ : రోగాలను దూరం చేసేది యోగా అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డిసుదీర్‌రెడ్డి అన్నారు. బండ్లగూడ హరిణ వనస్థలి పార్కు ,సరూర్‌నగర్ ప్రియదర్శిని పార్కులో అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా సుధీర్‌రెడ్డి యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషి శరీరాన్ని రోగాలకు దూరం చేసేది యోగా ,మానసిక ,శారీరక పటిష్టత యోగాతో సాధ్యం జరుగుతుందన్నారు. రోజు ప్రతి ఒక్కరూ కొంత సమయం యోగాకు కేటాయిస్తే మానసిక ఓత్తిడిని తగ్గించుకొని ఆరోగ్యవంతమైన జీవితం అనుభవించవచ్చన్నారు. ఈకార్యక్రమంలో భారాస డివిజన్ అధ్యక్షుడు చిరంజీవి ,జక్కడి మల్లారెడ్డి ,జగదీష్ యాదవ్ ,నర్రే శ్రీనివాస్ ,బేర బాలకిషన్ ,యోగ గురువు ప్రభాకర్‌లు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News