సిద్దిపేట: యోగాను నిత్యా జీవితంలో భాగం చేసుకోవాలని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట పట్టణంలోని కొండా భూదేవి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ యోగ దినోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ప్రజలందరికీ ప్రపంచ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. యోగాను దినచర్యలో భాగం చేసుకొని దీర్ఘాయుష్షును పొందాలన్నారు.
ప్రపంచంలో చాలామందికి మన తీసుకునే ఆహారం అలవాట్ల వలనే రోగాలు వస్తాయని, యోగా ద్వార రోగాల బారిన పడకుండా కాపాడుకోవచ్చన్నారు. పిల్లల నుండి పెద్దల వరకు యోగా చేయాలని సూచించారు. యోగా చేస్తే శారీరక, మానసిక సమస్యల నుండి కాపాడుకోవచ్చని, యోగా, వాకింగ్, సూర్య నమస్కారాలు వలన రోజు మరింత పనులు బాగచేసుకోవచ్చన్నారు. భారత దేశాన్ని చూసి వివిధ దేశాల యోగా నేర్చుకున్నాయని హరీష్ రావు ప్రశంసించారు. యోగా ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగ పడుతుందని, ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణీలకు యోగా లాంటి శిక్షణ ఇస్తున్నామని, గర్భిణీ స్త్రీలు యోగా చేస్తే సాధారణ ప్రసూతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు.
- Advertisement -