Wednesday, November 13, 2024

ప్రతిరోజు యోగా, వాకింగ్, రన్నింగ్ చేయాలి

- Advertisement -
- Advertisement -

జగదేవ్‌పూర్: రాష్ట్ర ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండల పరిధిలోని మునిగపడ గ్రామంలో ఎంపిటిసి, ఎంపిటిసిల ఫోరం జిల్లా అధ్యక్షుడు కిరణ్ గౌడ్ తన సొంత ఖర్చులతో 3కె రన్ నిర్వహించారు. ఈ రన్‌ను రాష్ట్ర ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ,ఎస్‌ఐ కృష్ణమూర్తి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ యువకులు శరీర దారుఢ్యాన్ని పెంపొదించుకోవాలన్నారు. అనంతరం ఎస్‌ఐ కృష్ణమూర్తి మాట్లాడుతూ యువకులు అన్నిరంగాల్లో రాణించాలన్నారు. యువతలో దాగి ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి వారిని జిల్లా, రాష్ట్ర , జాతీయ స్థాయిలో వెళ్లడానికి కృషి చేస్తామన్నారు.

అనంతరం పరుగు పందెంలో పాల్గొన్న వారికి ఎంపిటిసి కిరణ్ గౌడ్ టీ షర్ట్‌లను పంపిణీ చేశారు. గెలుపొందిన విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు. 3కె రన్ నిర్వహించిన ఎంపిటిసి కిరణ్ గౌడ్‌ను ప్రతాప్‌రెడ్డి అభినందించారు. గెలుపొందిన విజేతకు రాష్ట్ర ఎఫ్‌డిసి చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి రూ. 5వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బాల్‌లక్ష్మి, ఐలయ్య, బిక్షపతి, రాజేశ్వరి, రవి, ఇటిక్యాల సర్పంచ్ చంద్రశేఖర్ గుప్తా, పిఎసిఎస్ డైరెక్టర్ భూమయ్య, జగదేవ్‌పూర్ గ్రామ బిఆర్‌ఎస్ అధ్యక్షుడు బుద్ద నాగరాజు, బిఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు శ్రీనివాస్, ఉప సర్పంచ్ లావణ్య, మల్లేశం, యువకులు, నర్సింలు, కళ్యాణ్, రవి, పోలీస్ సిబ్బంది వివిధ గ్రామాల యువకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News