Monday, January 20, 2025

బిజెపియే గెలుస్తుంది: యోగేంద్ర యాదవ్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఇటీవల ప్రశాంత్ కిశోర్, తర్వాత  ఇయాన్ బ్రెమ్మర్ బిజెపి గెలుస్తుందని చెప్పాక ఇప్పుడు స్వరాజ్ ఇండియా నాయకుడు యోగేంద్ర యాదవ్ కూడా బిజెపియే గెలుస్తుందని విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ట్యాలీ 100 మార్కును టచ్ చేయొచ్చని కూడా ఆయన అన్నారు. కాగా బిజెపి 240 నుంచి 260 సీట్లను, దాని మిత్రపక్షాలు 34 నుంచి 45 సీట్లను గెలుచుకుంటాయని కూడా తెలిపారు.

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 272 సీట్లు కావలసి  ఉంటుంది. కాగా బిజెపి/ఎన్ డిఏ ప్రస్తుతం 303/323 సీట్లు ఉన్నాయి. 18 సీట్లు గెలిచిన శివసేన ఇప్పుడు ఎన్ డిఏలో లేదు. జూన్ 4న ఎవరికి ఎన్ని అనేది తేలిపోతుంది అని ప్రశాంత్ కిశోర్ ఎక్స్ లో (ఇదివరకటి ట్విట్టర్)లో పేర్కొన్నారు. బిజెపి పట్ల వ్యతిరేకత పెద్దగా లేదు కనుక బిజెపియే మెజారిటీ సాధిస్తుందని ప్రశాంత్ కిశోర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదిలా ఉండగా ఇయాన్ బ్రెమర్ అనే అమెరికా రాజకీయ శాస్త్రజ్ఞుడు ఓ ఛానెల్ లో బిజెపి 295 నుంచి 315 సీట్లను గెలుచుకుంటుందన్నారు. బిజెపి ఈసారి తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, తెలంగాణలో కూడా సీట్లను  పెంచుకోబోతోందని వినికిడి.

2019 సార్వత్రిక ఎన్నికలో కాంగ్రెస్  కేవలం 52 సీట్లే గెలిచింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News