Friday, December 27, 2024

యుపిలో యోగి 2.0 సర్కార్

- Advertisement -
- Advertisement -

Yogi 2.0 sarkar in uttar pradesh

52 మంది జింబో కేబినెట్
ప్రధాని అతిధిగా వేడుక
కేంద్ర మంత్రుల రాక
ఉప ముఖ్యమంత్రిగా తిరిగి మౌర్య
తరలివచ్చిన పలురంగాల ప్రముఖులు

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యానాథ్ శుక్రవారం ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టడం ఇది యోగికి రెండోసారి. అట్టహాసంగా ఇక్కడి ఏకానా స్టేడియంలో జరిగిన ప్రమాణస్వీకారోత్సవానికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన అతిధిగా వచ్చారు. ప్రముఖ బిజెపి నేతలు, పలువురు కేంద్ర మంత్రులు, సినీ దిగ్గజాలు, వ్యాపారవేత్తలు తరలివచ్చారు. శుక్రవారం యోగి ఆదిత్యానాథ్‌తో గవర్నర్ ఆనందిబెన్ పటేల్ ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రులుగా కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రిజేష్ పాఠక్ ప్రమాణం చేశారు. మొత్తం 52 మందితో కూడిన జంబో కేబినెట్ నేడు కొలువుదీరింది. వీరిలో 18 మంది కేబినెట్ హోదా మంత్రులు, 14 మంది స్వతంత్ర హోదా మంత్రులు ఉన్నారు. 20 మంది సహాయ మంత్రులు అయ్యారు.

ఉపముఖ్యమంత్రి మౌర్య ఎన్నికలలో ఓడారు. అయినా తిరిగి ఈ హోదాను కల్పించారు. హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బిజెపి అధ్యక్షులు జెపినడ్డా, మాజీ ముఖ్యమంత్రుల రాకతో సందడి నెలకొంది. బీహార్ సిఎం నితీష్‌కుమార్ కూడా హాజరయ్యారు. గురువారం ఉత్తర ప్రదేశ్ బిజెపి శాసనసభా పక్ష నేతగా యోగి ఆదిత్యానాథ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తరువాత ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి ప్రభుత్వ స్థాపనకు తమను ఆహ్వానించాలని కోరారు. ఐఎఎస్ నుంచి రాజకీయాలకు వచ్చిన ఎకె శర్మ, సురేష్ ఖన్నా, సూర్య ప్రతాప్ సాహీ, స్వతంద్ర దేవ్ సింగ్ , బేబీ రాణి మౌర్య, బిజెపి మిత్రపక్షం అప్నాదళ్ (సోనేలాల్) నుంచి ఆశీష్ పటేల్, నిషాద్ పార్టీ చీఫ్ సంజయ్ నిషాద్ కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణాలు చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరిన జితిన్ ప్రసాద కూడా కేబినెట్ మంత్రి అయ్యారు. ఐపిఎస్ అయి ఉండి రాజకీయాలలోకి వచ్చిన అసీం అరుణ్, దయా శాఖర్ సింగ్, నితిన్ అగర్వాల్, కళ్యాణ్‌సింగ్ మనవడు సందీప్ సింగ్ స్వతంత్ర హోదా గల సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు. అతిధులుగా ఈ కార్యక్రమానికి దాదాపు రెండు వేల మందిని ఆహ్వానించారు. ఇక 85 వేల మంది ప్రమాణస్వీకార వేడుకకు తరలివచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News