Friday, January 24, 2025

రాధికా ఖేరా రాజీనామా… కాంగ్రెస్ పై  మండిపడ్డ యోగి ఆదిత్యనాథ్

- Advertisement -
- Advertisement -

లక్నో: కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, భారత కూటమికి తమ డీఎన్‌ఏలోనే  ‘రామద్రోహం’ ఉందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం అన్నారు. కాంగ్రెస్ నేత రాధికా ఖేరా తన పార్టీకి రాజీనామా చేయడంపై యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. అయోధ్యలోని రాముడి ఆలయాన్ని సందర్శించినందుకుగాను ఆమెను కాంగ్రెస్ అవమానించిందని అన్నారు.

“రామ్‌లాలా ఆశీర్వాదం కోసం ఆమె అయోధ్యకు వచ్చింది, దానికి కాంగ్రెస్ నాయకులు ఆమెను అవమానించారు. అవమానాలతో విసిగిపోయిన ఆమె రాజీనామా చేశారు. ఇది కాంగ్రెస్, ఎస్‌పి వారి డిఎన్‌ఎలో ఉన్న ‘రామ ద్రోహం’ ని చూపిస్తోందన్నారు. ఇండియా కూటమితో సంబంధం ఉన్న వ్యక్తులకు వారి డిఎన్ఏలోనే ‘రామ ద్రోహం’ ఉందని ఆయన ఏఎన్ఐకి తెలిపారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News