Saturday, November 23, 2024

కాంగ్రెస్ నాశనానికి రాహుల్, ప్రియాంక చాలు: యోగి

- Advertisement -
- Advertisement -

లక్నో: కాంగ్రెస్ పార్టీని నాశనం చేయడానికి ఆ పార్టీ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చాలునని, వేరెవరూ అక్కరలేదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీజేపీ నేత యోగి ఆదిత్యనాధ్ వ్యాఖ్యానించారు.“ బేకార్ ” కాంగ్రెస్‌కు ఓటెయ్యవద్దని ఉత్తరాఖండ్ ప్రజలను తాను కోరానని చెప్పారు. సోమవారం ఆయన ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రియాంక గాంధీ ఆదివారం పంజాబ్‌లో మాట్లాడుతూ రాహుల్ గాంధీతో తనకు విభేదాలున్నట్టు యోగి ఆదిత్యనాధ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తాను రాహుల్ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తానని, ఇదే విధంగా ఆయన కూడా తన కోసం త్యాగం చేస్తారని చెప్పారు. తమ మధ్య విభేదాలేవీ లేవన్నారు. ఈ నేపథ్యంలో యోగి ఆదిత్యనాధ్ ఓ వార్తా సంస్థతో మాట్లాడారు. హిజాబ్ వివాదం గురించి మాట్లాడుతూ పాఠశాలల్లో సరైన డ్రెస్ కోడ్ ఉండాలన్నారు. గజ్వాఏహింద్ కోసం వారు కంటున్న కలలు కయామత్ వరకు నెరవేరవని చెప్పారు. ఇది నవభారతమని, ప్రపంచంలో గొప్ప ప్రజాదరణ గల నాయకుడు ప్రధాని నరేంద్రమోడీ ఉన్న భారతదేశమని తెలిపారు. నవభారతం రాజ్యాంగం ప్రకారం పనిచేస్తోందని, షరియా ప్రకారం కాదని వివరించారు. ఈ నవభారతంలో అందరికీ అభివృద్ధి అందుతుందని, ఎవరినీ బుజ్జగించేది లేదని తెలిపారు. వ్యక్తిగత ఇష్టాయిష్టాలు, ప్రాథమిక హక్కులు, నమ్మకాలను దేశం పైనా, వ్యవస్థల పైనా రుద్దలేమని చెప్పారు.

కాషాయం ధరించాలని, ఉత్తర్‌ప్రదేశ్ ప్రజలను, కార్యకర్తలను అడిగామా? అని ప్రశ్నించారు. తనకు నచ్చినదాన్ని ప్రజలు ధరిస్తారని, కానీ పాఠశాలల్లో మాత్రం డ్రెస్ కోడ్ ఉండాలన్నారు. ఇది పాఠశాలలు, వాటిలో క్రమశిక్షణకు సంబంధించిన విషయమని పేర్కొన్నారు. వ్యక్తిగత నమ్మకాలు వేరని, వ్యవస్థల విషయానికి వచ్చేసరికి, వాటిలోని నియమ నిబంధనలను అంగీకరించాలని వివరించారు. దేశం విషయానికి వచ్చేసరికి రాజ్యాంగాన్ని పాటించాలన్నారు. హిజాబ్ ధరించిన మహిళ దేశానికి ప్రధాని అవుతుందని ఏఐఎంఐఎం చీఫ్ అసరుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై యోగి ఆదిత్యనాధ్ స్పందిస్తూ, ప్రతిబాలిక, భారత దేశ బిడ్డ. హక్కులు, స్వాతంత్య్రం కోసమే ప్రధాని మోడీ ట్రిపుల్ తలాక్‌కు ఫుల్‌స్టాప్ పెట్టారనని ఉదహరించారు. బాలికలకు న్యాయం చేయడం, వారిని గౌరవించడం, వారిని సాధికారికంగా తీర్చిదిద్దడం కోసమే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. షరియా ప్రకారం వ్యవస్థ నడవదని, కేవలం రాజ్యాంగం ప్రకారం మాత్రమే నడుస్తుందని, వ్యవస్థలో రాజ్యాంగం అమలైతే ప్రతి బాలికకు రక్షణ, గౌరవం లభిస్తాయని, ప్రతి మహిళ స్వయం సమృద్ధతను సాఘిస్తుందని చెప్పారు.

Yogi Adityanath slams Rahul and Priyanka Gandhi

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News