Monday, December 23, 2024

ఇక అయోధ్యలో కర్ఫ్యూలు ఉండవు, కాల్పులు జరగవు

- Advertisement -
- Advertisement -

అయోధ్యలో రామాలయం నిర్మాణంతో 500 ఏళ్ల దేశ ప్రజల కల నెరవేరిందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తమ దేవుణ్ని స్వస్థలానికి తీసుకువచ్చేందుకు మెజారిటీ మతస్థులు ఇన్నేళ్లుగా పోరాటం జరపడం చరిత్రలో ఇదే మొదటిసారన్నారు.

బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి కావడంతో యావత్ భారతదేశమే అయోధ్యధామంగా మారిందన్నారు. 1990లో కరసేవకులపై జరిగిన కాల్పులను ఆయన పరోక్షంగా ప్రస్తావిస్తూ, ఇకపై అయోధ్యలో కర్ఫ్యూలు, కాల్పులు జరగవన్నారు. అయోధ్యలో రామాలయం కోసం ఎంతో మంది తమ ప్రాణాలను త్యాగం చేశారని ఆయన చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News