Saturday, November 16, 2024

యూపీలో తరువాతి సిఎం యోగి ఆదిత్యనాధే : ప్రధాని మోడీ జోస్యం

- Advertisement -
- Advertisement -

Yogi Adityanath to be next CM in UP: Prime Minister Modi's prediction

 

లక్నో : ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ బిజెపియే అధికారం లోకి వస్తే ముఖ్యమంత్రిగా తిరిగి యోగి ఆదిత్యనాధ్ అయ్యే అవకాశం ఉందన్న సంకేతాలు ప్రధాని నరేంద్రమోడీ నుంచి వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో యోగి నేతృత్వంలో బీజేపీ ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రశంసిస్తూ ఆదివారం వర్చువల్ పోల్ ర్యాలీలో ప్రధాని మోడీ ప్రసంగించారు.మధుర, ఆగ్రా, బులంద్‌షహర్, ఓటర్లను ఉద్ధేశించి ఆయన ఈ ర్యాలీలో ప్రసంగిస్తూ గత రెండేళ్లలో కరోనా సంక్షోభం లేకుంటే యోగీ ఆదిత్యనాధ్ కేంద్ర ప్రభుత్వ పథకం కింద పేదలకు ఇళ్లు నిర్మించి అనుకున్న లక్షాలను నెరవేర్చి ఉండేవారని చెప్పారు. ఇలాంటి లక్షాలను ఆదిత్యనాధ్ నెరవేర్చడానికి వీలుగా వచ్చే ఐదేళ్లు బిజెపి పరిపాలించేలా ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారన్న విశ్వాసాన్ని మోడీ వ్యక్తం చేశారు.

కేంద్ర ప్రభుత్వ ఉజ్వల స్కీమ్ కింద పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించడమౌతుందని ప్రస్తావిస్తూ వచ్చే ముఖ్యమంత్రి ఆదిత్యనాదే అన్న అభిప్రాయాన్ని వెలుగు లోకి తెచ్చారు. ఆదిత్యనాధ్ ప్రభుత్వం రాకముందు సమాజ్‌వాది ప్రభుత్వ పాలనలో శాంతిభద్రతలు క్షీణించడాన్ని ప్రస్తావించారు. ఉత్తరప్రదేశ్‌లో బిజెపిని గెలిపించాలని, ఆదిత్యనాధ్‌ను ముఖ్యమంత్రి చేయాలని (భాజాపా కో జితానా జై, యోగీకో ఫిర్ ముఖ్యమంత్రి బనానా హై ) ఉత్తరప్రదేశ్ మహిళలు నిర్ణయించుకున్నారని మోడీ జోస్యం చెప్పారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News