- Advertisement -
పుణె: మహిళలు తలచుకుంటే ఏదైనా సాధించగలరు. పుణెకు చెందిన యోగిత సతవ్ ఇందుకు చక్కని ఉదాహరణ. 20 మంది మహిళలు జనవరి 7న ఓ మినీ బస్సులో పిక్నిక్‌కు వెళ్లారు. పుణె శివార్లలో సరదాగా గడపాలనుకున్నారు. కానీ అనుకోని ఉపద్రవవం ముంచుకొచ్చింది. బస్సు నడిపే డ్రైవర్ అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోయాడు. ఊహించని పరిణామంతో అంతా భయాందోళనకు గురయ్యారు. అతడిని ఎలా కాపాడాలో వారికి ఒక్క పెట్టున అర్థంకాలేదు. కానీ 42 ఏళ్ల యోగిత సతవ్ చేస్తలుడిగి కూర్చుండిపోలేదు. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు నడుం బిగించింది. ఆమెకు అంతకు ముందు కేవలం కారు నడిపిన అనుభవమే ఉంది. హెవీ వెహికిల్ నడిపిన అనుభవంలేదు. అయినా సరే ఆమె బస్సును నడిపింది. 35కిమీ. నడిపి అతడిని ఆసుపత్రికి చేర్చింది. చివరికి కథ సుఖాంతం అయింది.
- Advertisement -