Tuesday, January 21, 2025

బైక్‌పై నుండి పడి యువకుడి మృతి

- Advertisement -
- Advertisement -

కరీంనగర్ క్రైం: కరీంనగర్ పట్టణంలోని టెలిఫోన్ క్వార్టర్స్ మెయిన్ రోడ్‌లో శుక్రవారం రాత్రి జరిగిన ప్రమాదంలో నాగులమల్యాల గ్రామానికి చెందిన వెన్నం సాత్విక్ (15) మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. టుటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వెన్నం సాత్విక్ సప్తగిరికాలనీ నుండి తన అమ్మని తీసుకోవడానికి ద్విచక్రవాహనం సీడీ 100 టీఎస్ 02 ఈఈ 2023 పై వెళ్తుతుండగా టెలిఫోన్ క్వార్టర్స్ మెయిన్‌రోడ్ దగ్గర ఆవు అడ్డు రావడంతో అదుపు తప్పి కింద పడగా తలకు తీవ్ర గాయాలయ్యాయి.

చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా సాత్విక్ పరిశీలించిన డాక్టర్లు తలకు తీవ్ర గాయం వల్ల లోపల నరం తెగిపోయిందని తెలపడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో శనివారం ఉదయం చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. మృతుని తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News