Sunday, January 19, 2025

బోరబండలో దారుణం.. యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : తనను ప్రేమించటంలేదని కోపంతో యువతిని కత్తితో గొంతు కోసిన సంఘటన హైదరాబాద్ బోరబండలోని బంజారానగర్‌లో సోమవారం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు యువకుడిని పట్టుకుని చితకబాది ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. పోలీసుల కథనం ప్రకారం…ఎస్‌ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బోంరబండ, బంజారానగర్‌కు చెందిన కిషోర్ అదే కాలనీలో ఉంటున్న లక్ష్మిని ప్రేమిస్తున్నానని ఏడేళ్ల నుంచి వెంటపడుతున్నాడు.

అయినా కూడా యువతి కిషోర్‌ను పట్టించుకోవడంలేదు, దీంతో యువతిపై కక్ష పెంచుకున్న యువకుడు బంజారానగర్‌లో యువతి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా కత్తితో గొంతు కోసేందుకు ప్రయత్నించాడు. యువతి కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వచ్చి అడ్డుకున్నారు. గొంతు, చేతికి గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు. కిషోర్‌ను పట్టుకున్న స్థానికులు దేహశుద్ది చేసి ఎస్‌ఆర్ నగర్ పోలీసులకు అప్పగించారు. బాధితురాలిని మోతీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News