Sunday, January 19, 2025

మావోల దుశ్చర్యకు అమాయకుడి బలి

- Advertisement -
- Advertisement -

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో భద్రతా బలగాలను దెబ్బతీసేందుకు మావోయిస్టులు అమర్చిన ఐఇడి తగిలి ముట్వెండి గ్రామానికి చెందిన ఓ అమాయక యువకుడు చనిపోయాడు. గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పటేల్‌పర ముట్వెండి వాసి (18) ముట్వెండికి మూడు కి.మీ దూరంలో ఉన్న గ్రామీణ అటవీ ఉత్పత్తులను సేకరించడానికి వెళ్లాడు. మావోయిస్టులు అమర్చిన ఐఇడి తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటీవల ఆ ప్రాంతంలోని గ్రామ కాచిల్వార్ పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అంతర్గత రహదారి నుండి కాలినడకన వస్తుండగా ఇతావర్ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన ఐఇడిని తగిలి తీవ్రంగా గాయపడ్డాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News