Monday, November 18, 2024

4 నుంచి ‘యోనో సూపర్ సేవింగ్ డేస్’ కార్నివాల్

- Advertisement -
- Advertisement -

‘Yono Super Saving Days’ Carnival from 4th Feb

 

న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్‌బిఐ తన వినియోగదారుల కోసం ప్రత్యేక షాపింగ్ కార్నివాల్‌ను ప్రారంభిస్తోంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ షాపింగ్ కార్నివాల్‌లో వినియోగదారులు షాపింగ్ నుండి హోటళ్ళు, ఫ్లైట్ బుకింగ్‌ల వరకు అన్నింటికీ తగ్గింపును పొందవచ్చు. ఫిబ్రవరి 4 నుంచి ‘యోనో సూపర్ సేవింగ్ డేస్’ కార్నివాల్ పేరిట ఎస్‌బిఐ(స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) ఈ ఆఫర్‌ను అందిస్తోంది. నాలుగు రోజుల కార్నివాల్ ఫిబ్రవరి 4 న ప్రారంభమై ఫిబ్రవరి 7 వరకు ఉంటుంది. ఎస్‌బిఐ యోనో వాడుతున్న వినియోగదారులకు ఈ కాలంలో క్యాష్ బ్యాక్, ప్రత్యేక ఆఫర్లు లభిస్తాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News