Thursday, January 23, 2025

రాహుల్ గాంధీపై మంత్రి హర్దీప్ సింగ్ పూరి చెత్త వ్యాఖ్య!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తలాతోక లేకుండా వెధవ వ్యాఖ్య చేశాడు. సూరత్(గుజరాత్) కోర్టు పరువు నష్టం దావా కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చడంతో లోక్‌సభ నుంచి ఆయన అనర్హుడిగా వేటు వేయబడ్డాడు. ఆ తర్వాత రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ‘ నా పేరు సావర్కర్ కాదు, నా పేరు గాంధీ, నేను క్షమాపణ కోరే ప్రసక్తేలేదు’ అన్నారు.

దీనిపై హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ ‘సావర్కర్‌గారు ఎలాంటి సేవలందించారో మీకు తెలుసా? నేనిదివరకే అన్నాను, మీరు గుర్రపు పందెంలో ఓ గాడిదను పోటీకి నిలుపుతున్నారు’ అన్నారు. దాని వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేయబడింది. ప్రతిపక్షాలు రాహుల్ గాంధీపై వేటుకు నిరసన తెలుపుతుంటే పూరి ఓ ఉచిత సలహా ఇచ్చారు. ‘కాంగ్రెస్ పార్టీ సీరియస్‌గా సింహావలోకనం చేసుకోవాలి’ అన్నారు. వారేమిటో దేశ ప్రజలే నిర్ణయిస్తారు అన్నారు. ‘మీరు మహాభారత్, సావర్కర్ వంటి అంశాలు లేవనెత్తుతున్నారు’ అని ఆయన విమర్శించారు. గాంధీని కోర్టు దోషిగా తేల్చింది, తర్వాత వెంటనే ఆయన లోక్‌సభలో అనర్హతకు గురయ్యాడన్నారు.

 

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News