Wednesday, January 22, 2025

నెట్ వర్క్ లేకున్నా పోయిన ఫోన్ కనిపెట్టొచ్చు !

- Advertisement -
- Advertisement -

కాలిఫోర్నియా: సెర్చ్ ఇంజిన్ గూగుల్ తన ‘ఫైండ్ మై డివైజ్’ ఫీచర్ ని అప్ గ్రేడ్ చేసింది. దీంతో నెట్ వర్క్ లేకున్నా, బ్యాటరీ అయిపోయినా కనిపించకుండా పోయిన మొబైల్ ఫోన్ ను సులువుగా కనిపెట్టేయొచ్చు. ప్రస్తుతం అమెరికా, కెనడాలో మాత్రమే ఈ సదుపాయాన్ని అందిస్తోంది. కాగా త్వరలో ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ యూజర్లందరూ ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చని తన బ్లాగ్ లో పేర్కొంది. దీని వల్ల ఐఫోన్ లాగానే ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ లను ఎక్కడ ఉన్నా కనిపెట్టేయొచ్చు.

ఈ అప్ గ్రేడ్ ఫీచర్ ఆండ్రాయిడ్ 9 లేదా ఆ తర్వాతి వెర్షన్ ఫోన్లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. కేవలం స్మార్ట్ ఫోన్ లే కాదు, స్మార్ట్ వాచ్ లు, ఇయర్ బడ్స్ ను కూడా ఆఫ్ లైన్ లో ఉంటే కనిపెట్టేయొచ్చట.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News