Sunday, December 22, 2024

మీరు నన్ను జైల్లో ఇబ్బంది పెట్టగలరు.. అంతే : సిసోడియా

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. తాజాగా ఆయన ట్విటర్ వేదికగా స్పందించారు. జైల్లో పెట్టి తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేరని వ్యాఖ్యానించారు. “సర్… మీరు నన్ను జైల్లో ఉంచి ఇబ్బంది పెట్టగలరు. కానీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. బ్రిటిషర్లు కూడా స్వాతంత్య్ర సమర యోధులను ఇబ్బందులకు గురి చేశారు.

వారి స్థైర్యాన్ని కదిలించలేక పోయారు. ”అని సిసోడియా ట్వీట్ చేశారు.శుక్రవారం సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ లోని రౌస్ అవెన్యూ కోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఈడీ తన వాదనలు వినిపించింది. మద్యం కుంభకోణంలో ఆయనది ప్రత్యక్ష పాత్రే అని వెల్లడించింది. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం సిసోడియాను కస్టడీకి అప్పగించాలన్న ఈడీ అభ్యర్థనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఆయనను ఏడు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. మరోవైపు సిబిఐ కేసులో ఆయన బెయిల్ పిటిషన్‌పై విచారణను మార్చి 21 వ తేదీకి వాయిదా వేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News