Thursday, January 23, 2025

ప్రగల్పాలు పలకడం కాదు మాట మీద నిలబడాలి

- Advertisement -
- Advertisement -

సూర్యాపేట : రాష్ట్రంలో రైతులకు 24గంటలు ఉచిత కరెంటు సరఫరా ఇవ్వడం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ సవాలా తీసుకొని గురువారం మునగాల మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద చేరుకొని రైతులకు బిఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు ఉచిత కరెంటు ఇస్తున్నాము లేదో తేల్చుకునేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కావాలని రైతులు ఇచ్చిన వివరణ మేరకు ఉచిత విద్యుత్ ఇవ్వడం లేదని నిరూపిస్తే తమ పదవికి రాజీనామా తక్షణమే చేస్తానని సబ్‌స్టేషన్ ముందు రా జీనామా పత్రంతో కూర్చున్నారు.

అనంతరం టిపిసిసి అధ్యక్షులు రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దిష్టిబొమ్మని దహనంం చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, పలు గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచులు, కోదాడ నియోజకవర్గాల నా యకులు, మండల పార్టీ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News