Thursday, January 23, 2025

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

- Advertisement -
- Advertisement -

పాలకవీడు : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని శూన్యపహాడ్ గ్రామానికి చెందిన రమావత్ తరుణ్(18) జెసిబి ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. గురువారం సాయంత్రం ఇంటి నుండి వెళ్ళి తన స్నేహితునితో కలిసి మిర్యాలగూడెంకు వెళ్ళి కొత్త మొబైల్ ఫోన్ కొన్నాడు.

సాయంత్రం నేరెడుచర్ల శివారులో తన బావతో కలిసి పని చేసి అక్కడ పని ముగించుకుని రాత్రి 8:30గంటల సమయంలో తిరిగి ఇంటికి తన మోటార్ సైకిల్ బజాజ్ ప్లాటీనాపై వెళుతూ బెట్టెగూడెం గ్రామ శివారులో మూల మలుపు వద్ద బైక్ అదుపుతప్పి వరిపొలంలో గల మిషన్ భగీరధ పైప్‌లైన్ ఎయిర్ పంప్‌కు ఢీకొట్టి వెల్లకిల బురదలో కూరుకుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News