రాయగిరిలో ప్రమాదవశాత్తు రోడ్డు డివైడర్‌కు ఢీకొని రాంనగర్‌కు చెందిన యువకుడి మృతి
బైక్ రైడింగ్‌లో పలు బహుమతులను గెలుచుకున్న రఘురామ్
మన తెలంగాణ/ముషీరాబాద్: యాదగిరి గుట్ట నుంచి హైదరాబాద్ చిలకనగర్‌కు వస్తున్న క్రమంలో రాయగిరి వద్ద ప్రమాదవశాత్తు రోడ్డు డివైడర్‌కు ఢీకొని రాంనగర్‌కు చెందిన ఫోటోగ్రాఫర్, బైక్ రైడర్ రఘు రామ్(26) మృతి చెందాడు. దీంతో రాంనగర్ మేడిబావి బస్తీలో విషాదచాయలు అలుముకున్నాయి. మృతుడి స్నేహితులు చెప్పిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. అడిక్‌మెట్ డివిజన్ రాంనగర్ మేడిబావి బస్తీకి చెందిన నర్సింగ్‌రావు, నాగమణి దంపతులకు ఇద్దరు కుమారులు. వీరిలో పెద్ద కొడుకు రఘురామ్(26) వృత్తిరీత్యా ఫోటోగ్రాఫర్‌తో పాటు బైక్ రైడింగ్‌లో కూడా పొల్గొంటుంటాడు. అనేక సార్లు కెటిఎమ్ సంస్థ ద్వారా జరిగే బైక్ రైడింగ్ పోటీల్లో ప్రథమ స్థానాన్ని సంపాదించి విజేతగా బహుమతులను పొందాడు. అలాగే తన బాబాయ్ వెంకటేష్‌తో కలిసి పెళ్లిళ్లు, శుభ కార్యాలకు ఫొటో గ్రాఫర్‌గా వెళ్తుంటాడు. ఇదిలా ఉండగా శనివారం స్నేహితులతో కలిసి యాదగిరి గుట్టకు రఘు వెళ్లాడు. అయితే చిలకనగర్‌లో ఆదివారం బోనాలు ఉండటంతో తండ్రి నర్సింగ్‌రావు యాదగిరి గుట్ట నుంచి నేరుగా చిలకనగర్‌కు రావాలని ఫోన్ చేసి చెప్పాడు.
దీంతో ఆదివారం మధ్యాహ్నం యాదగిరి గుట్టలో స్వామి వారి దర్శనం చేసుకున్న తర్వాత స్నేహితులతో చెప్పి రఘు ఒక్కడే బయలుదేరారు. రాయగిరి మార్గం మీదుగా వస్తుండగా ప్రమాదవశాత్తూ రోడ్డు డివైడర్‌కు ఢీకొన్న రఘు తీవ్ర గాయాలకు గురయ్యాడు. విషయం తెలుసుకున్న స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం ఇవ్వడంతో రాయగిరి స్థానిక ఏరియా ఆసుపత్రికి రఘును తరలించారు. కానీ చాతికి తీవ్ర గాయాలు కావడంతో రఘు ఘటనా స్థలంలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బైక్ రైడింగ్‌లో అనేకసార్లు బహుమతులు సాధించిన రఘురామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోవడం ఆశ్చర్యానికి కలిగిస్తుందని అతని స్నేహితులు, బంధువులు వాపోయారు. సోమవారం పోస్టుమార్టం నిర్వహించిన తర్వాత రాంనగర్ మేడిబావి బస్తీకి రఘు మృతదేహాన్ని తీసుకువచ్చే అవకాశం ఉందని స్నేహితులు తెలిపారు.
మేడిబావి బస్తీలో విషాదచాయలు
రోడ్డు ప్రమాదంలో రఘురామ్ చనిపోవడంతో రాంనగర్ మేడిబావి బస్తీలో విషాదచాయలు అలుముకున్నాయి. ఘటన జరిగిందని తెలియగానే రఘు తల్లిదండ్రులు నర్సింగ్‌రావు, నాగమణి, కుటుంబ సభ్యులు హుటాహుటిన రాయగిరికు పయనమయ్యారు. బస్తీలో సైతం మంచి అబ్బాయి చనిపోవడం ఏంటని దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. చేతికి వచ్చిన కొడుకు కళ్ల ముందే చనిపోయి ఉండటాన్ని చూసిన తల్లిదండ్రుల దుఃఖాన్ని చూసి కంటతడి పెట్టారు.
Young boy died in Road Accident in Rayagiri