Monday, December 23, 2024

ఈత సరదాకు బాలుడు మృతి

- Advertisement -
- Advertisement -

శామీర్‌పేట: సరదా కోసం ఈతకు వెళ్లిన బాలుడు నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. శామీ ర్‌పేట పోలీసులు, బాధితులు తెలిపిన కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కృష్ణాజిల్లా, గుడివాడ నుంచి అమ్ముల మురళీమోహన్ బతుకుదెరువు కోసం గత పది సంవత్సరాల క్రితం శామీర్‌పేట మండలం తూంకుంటకు తన భార్య పిల్లలతో వచ్చి సెక్యూరిటీ గార్డ్‌గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. తన కుమారుడు చరణ్ లీల ప్రసాద్ (10) ఓ పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్నాడు.

ఆదివారం సెలవు దినం కావడంతో స్నేహితులతో కలిసి ఆడుకునేందుకు ఇంటి నుంచి ఉదయం బయలుదేరాడు. తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని బంతికుంట చెరువులో నీటిలో మునిగిపోతుండగా స్థానికులు చూసి అతన్ని ఒడ్డుపైకి తీసుకువచ్చారని తెలిపారు. తన కుమారుడిని స్థాని క మెడిసిటీ ఆసుపత్రికి తీసుకువెళ్లగా వైద్యులు చూసి అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని బోరున విలపించాడు. ఈ మేరకు శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News