- Advertisement -
వాషింగ్టన్: అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని 14వ యూ స్ట్రీట్ లోని మ్యూజిక్ ఈవెంట్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ ఘటనలో ఓ యువకుడు మృతి చెందగా, పలువురు గాయపడినట్టు సమాచారం. ఈ ఘటన జరిగిన ప్రదేశం శ్వేత సౌధానికి కేవలం 2 మైళ్ల దూరంలో ఉంది. కాల్పులకు పాల్పడిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గాయపడిన వారిలో ఓ పోలీస్ అధికారి కూడా ఉన్నారని మెట్రోపాలిటన్ పోలీస్ శాఖ ప్రతినిధి చెప్పారు. కాల్పులకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ కూడా వైరల్ గా మారింది. కాల్పుల్లో గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని పోలీస్ శాఖ ట్వీట్ చేసింది.
Young Boy shot dead in Washington DC
- Advertisement -