Wednesday, January 22, 2025

ప్రేమజంటను ఊరు దాటించి…. సర్పంచ్ కొట్టాడని యువకుడు ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

Mother And son commit suicide due to family quarrels

భద్రాద్రి కొత్తగూడెం: ప్రేమజంటను ఊరు దాటించినందుకు గ్రామ సర్పంచ్ ముగ్గురు యువుకులను కొట్టాడు. దీంతో ఓ యువకుడు తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాద్రి జిల్లా అశ్వరావు పేట మండలం నారం వారిగూడెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తుమ్మా భవానీ శంకర్(19) అనే యువకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏలూరు జిల్లా టి నర్సాపురం మండలం గండిగూడెం గ్రామంలో నివసిస్తున్నాడు. తన అమ్మమ్మ ఊరు నారంవారిగూడెంలో ఉండి డిగ్రీ చదువుతున్నాడు. వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన ప్రేమజంట గ్రామం నుంచి పారిపోయింది. దీంతో ఆ ప్రేమజంటను ఊరు దాటించిన ముగ్గురు యువకులు భవానీ శంకర్, ముత్యాలరావు, వేముల నాగరాజును పెద్ద మనషుల సమక్షంలో నిలబెట్టారు. పంచాయతీ కార్యాలయం ముందు ముగ్గురిని సర్పంచ్ కొట్టాడు. దీంతో మనస్థాపం చెందిన భవానీ శంకర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకునే ముందే సెల్ఫీ వీడియో తీశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో పాటు భవానీ శంకకర్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సర్పంచ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News