Sunday, December 29, 2024

క్షణికావేశం..యువ జంట ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

అశ్వారావుపేట: క్షణికావేశంలో ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువజంట ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండల కేంద్రం అశ్వారావుపేటలో గురువారం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని చింతల బజార్‌కు చెందిన యర్రం కృష్ణ(24) దమ్మపేట మండలం నెమలిపేటకు చెందిన రమ్య(22)లు మూడేళ్ళ క్రితం ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగగా గత కొంతకాలంగా ఇరువురి మధ్య తరచూ గొడవలు జరుగుతుండటంతో పంచాయతీలు కూడా జరిగినట్లు సమాచారం.

ఈ నేపధ్యంలో మూడు వారాల క్రితం స్థానిక చింతలబజార్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని భార్యభర్తలు జీవిస్తున్నారు. కాగా గురువారం ఓ వైద్యశాలకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చిన భార్యభర్తలు ఎంతకీ బయటకు రాకపోవడంతో అనుమానంతో స్థానికులు తలుపులు పగలగొట్టి చూడగా ఇరువురు విగతజీవులుగా దర్శనమిచ్చారు. రమ్య మంచంపై ఉండగా కృష్ణ ఉరికి వేలాడుతూ కనిపించాడు.స్థానికుల సమాచారం మేరకు సిఐ కరుణాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి మృతదేహాలను పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News