చిన్నకోడూరు : సివిల్ కేసులో సిద్దిపేట రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి బెదిరించారని ఆరోపిస్తూ యువ రైతు సాయికుమార్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లాచిన్నకోడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి బెదిరించడంతోనే తన తమ్ముడు సాయికుమార్ ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడని బాధితుడి అన్న ప్రవీణ్‌కుమార్ తెలిపారు. చిన్నకోడూరు మండలం 601/ఆ/1 సర్వే నెంబర్‌లో తమ భూమి ఉందని, 21 సంవత్సరాల కింద కొనుగోలు చేసినట్లు తెలిపారు. తమ పొలం పక్కనే మరో వర్గానికి చెందిన రైతులు తమ భూమిలో నుండి దారి ఇవ్వాలని బెదిరిస్తున్నారని, ఈ విషయమై గత కొన్ని రోజులుగా తగాదా జరుగుతుందన్నారు. ఈ విషయమై సిద్దిపేట రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి కూడా సాయికుమార్‌ను బెదిరించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సాయికుమార్‌ను వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుతెలిపారు. సివిల్ తగాదాల్లో సీఐ జోక్యం తగదని తాము చెప్పడంతో పలు సెక్షన్ల కింద మాపైన కూడా కేసు నమోదు చేస్తానని సీఐ హెచ్చరిస్తున్నట్లుబాధితులు ఆరోపించారు.
సిఐ బెదిరింపులు.. యువ రైతు ఆత్మహత్యయత్నం
- Advertisement -
- Advertisement -
- Advertisement -