Friday, December 20, 2024

పురుగుల మందు తాగి యువ రైతు మృతి

- Advertisement -
- Advertisement -

పాల్వంచ : పురుగుల మందు తాగి యువకుడు మృతి చెందిన సంఘటన గువారం రాత్రి జరిగింది.వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని మల్లారం గ్రామానికి చెందిన కుంజా గణేష్ (30) వ్యవసాయం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నాడు . తన మిరప తోటకు తెగులు సోకటంతో చూసి వస్తానని చెప్పిన గణేష్ అక్కడనే పురుగుమందు తాగిన కొద్ది సేపటికి తాను మందు తాగిన విషయాన్ని ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలియజేశాడు.

దీంతో కుటుంబ సబ్యులు పంట చేను వద్దకు వెంటనే వెళ్ళి వెతికారు. సుమారు గంట తర్వాత జాడ తెలుసుకోగలిగారు. అప్పటికే అపస్మరక స్థితికి చేరుకొన్నాడు. హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News