Monday, December 30, 2024

పిడుగు పడి యువ రైతు మృతి

- Advertisement -
- Advertisement -

పిడుగు పడి యువ రైతు మృతి చెందిన ఘటన మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే..స్థానికుల కథనం ప్రకారం.. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలానికి చెందిన చౌదరి రమేష్ (30) అనే వ్యక్తి మండలంలోని చింతకర్ర గ్రామానికి వెళ్లే దారిలో షేక్ హుస్సేన్ అనే వ్యక్తి యొక్క పొలంలో వ్యవసాయం పనులు చేయడానికి వెళ్లాడు.

ఈ క్రమంలో వ్యవసాయ పనులు చేస్తుండగా పిడుగు పడడంతో చౌదరి రమేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుని భార్య చౌదరి సుమిత్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News