Sunday, January 19, 2025

శ్రీరాముడి జెండాతో స్కైడైవింగ్!

- Advertisement -
- Advertisement -

అయోధ్యలోని రామమందిరంలో విగ్రహాల ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రీరాముడిపై తమ భక్తిప్రపత్తులను చాటుకునేందుకు ప్రజలు అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు. ఒక ముస్లిం యువతి ముంబయి నుంచి అయోధ్యకు పాదయాత్రగా బయల్దేరిన సంగతి ఇప్పటికే మీడియాలో వచ్చింది. చాలామంది భక్తులు తమ ఇళ్లలో రామాయణ పారాయణం మొదలుపెట్టారు.

తాజాగా అనామిక శర్మ అనే యువతి శ్రీరాముడిపై తన భక్తిని చాటుకునేందుకు ఒక వింత మార్గాన్ని ఎంచుకుంది. ఆమె జైశ్రీరామ్ అని రాసి ఉన్న జెండాను చేతపట్టుకుని బ్యాంకాక్ లో 13వేల అడుగుల ఎత్తునుంచి స్కైడైవింగ్ చేసింది. అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్ఠాపన ఈనెల 22న జరుగుతున్న సందర్భంగా సరిగ్గా నెలరోజుల ముందు ఆమె ఈ సాహస విన్యాసం చేసింది. తన తండ్రి వైమానిక దళంలో పనిచేశారని, తాను ఈ విన్యాసం చేయడానికి ఆయనే స్ఫూర్తి అని అనామిక చెప్పింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News