Saturday, December 28, 2024

బెంగుళూరులో కాకినాడ యువతి దారుణ హత్య..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ ః బెంగుళూరులో కాకినాడకు చెందిన ఓ యువతి దారుణ హత్యకు గురైంది. తనను ప్రేమించిన అమ్మాయి తనను కాదని వేరే వ్యక్తితో పెళ్ళికి సిద్ధమవుతోందన్న కోపంతో ప్రేమోన్మాది అందరూ చూస్తుండగా కత్తితో 16 సార్లు పొడిచి చంపాడు. కాకినాడకు చెందిన లీలా పవిత్ర అనే యువతి బెంగుళూరు నగరంలోని దొమ్లూరులో ఒమేగా మెడిసిన్ కంపెనీలో ఉద్యోగిగా పనిస్తోంది. అక్కడ పనిచేసే శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివాకర్ అనే యువకుడు ఆమె పరిచయం అయ్యాడు. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారి ఐదేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నారు. అయితే ఇటీవల లీల పవిత్ర తన ప్రేమ విషయాన్ని ఇంట్లో పెద్దల దృష్టికి తీసుకొచ్చింది. వారి కులాలు వేరు కావడంతో వివాహానికి పెద్దలు అంగీకరించలేదు.

ఈ క్రమంలో ఇంట్లో వేరే సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. లీలా పవిత్రకు వేరే వ్యక్తితో పెళ్ళి కూడా నిశ్చయం చేశారు. అయితే తనను కాదని లీల వేరే వ్యక్తితో పెళ్ళికి సిద్ధం అవుతుడటం నచ్చని దివాకర్ ఆమెపై కోపం పెంచుకుని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయింత్రం 7.30 గంటలకు కంపెనీలో విధులను ముగించుకుని బయటకు వస్తున్న లీలా పవిత్ర కోసం నిందితుడు దినకర్ కాపు కాశాడు. ఆమె బయటకు వస్తున్న తరుణంలో ఎదురుగా వెళ్ళి కత్తితో చాతీ, పొట్టపై 16 పోట్లు పొడిచాడు. చుట్టపక్కల వారు చూసి తీవ్రగాయాలైన లీల ప్రవిత్రను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీవన్ భీమా నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News