Monday, December 23, 2024

ప్రేమ… పెళ్లికి నిరాకరించిన కానిస్టేబుల్… యువతి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

ఉరేసుకుని యువతి బలవన్మరణం


మన తెలంగాణ/ ఇల్లందు రూరల్: పోలీస్ శాఖలో పని చేస్తున్న యువకుడు ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ప్రాంతం కొమరారం గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఎస్‌సి కాలనీకి చెందిన చీమ బిందు(22) అనే యువతి తల్లిదండ్రులు చనిపోవడంతో తన మేనమామ ఇంట్లో ఉంటుంది.  బిందు గత నాలుగు సంవత్సరాలుగా తనకు బంధువు అయిన పోలారం గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడి సహజీవనం సాగిస్తోంది. పోలీస్‌శాఖలో పనిచేస్తున్న ఆ యువకుడితో ఇటీవల పెళ్ళి ప్రస్తావన తీసుకురాగా పది లక్షలు కట్నంగా ఇస్తేనే పెళ్ళికి పెద్దలు ఒప్పుకుంటారని పేర్కొనడంతో విషయం మేనమామకు చెప్పింది. దీంతో పోలారం గ్రామంలోని యువకుడి కుటుంబసభ్యులను యువతి కుటుంబసభ్యులు సంప్రదించగా వారు సైతం పదిలక్షలు ఇస్తేనే పెళ్ళికి సిద్ధమని తెలిపారు. నిరుపేద కుటుంబం కావడంతో అంత సొమ్ము ఇచ్చుకునే పరిస్థితి లేకపోవడంతో మనస్థాపానికి గురైంది.  శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బిందు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మేనమాయ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News