Sunday, January 19, 2025

తాత మరణం తట్టుకోలేక మనవరాలి ఆత్మహత్య

- Advertisement -
- Advertisement -

లోకేశ్వరం : తన తాతయ్య మరణాన్ని జీర్ణించుకోలేక మనవరాలు ఆత్మహత్యకు పూనుకున్న విషాద ఘటన పుస్పూర్ గ్రామంలో చోటు చేసుంది.వివరాలలోకి వెళితే.. ఎస్‌ఐ జి. సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. లోకేశ్వరం మండలంలోని పుస్పూర్ గ్రామానికి చెందిన గడ్డదాల ముత్తన్నపిబ్రవరి నెల 20.02.2023 న గుండెపోటుతో మరణించాడు. చిన్నప్పటి నుండి తాత వద్దనే గారాబంతో పెరిగింది దీపిక (17). దీపిక తాతయ్య మరణాన్ని జీర్ణించుకులేక ప్రతిరోజు బాధపడుతూ కృంగిపోయేదని, ఆదివారం ఉదయం 11 గంటలకు ఎప్పటిలాగే కాలకృత్యాలకు వెళ్లి వస్తానని తల్లి కమలకు చెప్పి వెళ్లింది. చాలాసేపటి వరకు

కూతురు తిరిగి ఇంటికి రాకపోయేసరికి అనుమానంతో వెతకగా మృతురాలు దీపిక చెప్పులు ఇంటికి సమీపాన గల చెరువు కట్టపై కనిపించాయని చెరవులో చూడగా మృతురాలు నీటిలో తేలియాడుతూ కనిపించింది. తనను అపురూపంగా పెంచిన తాత చనిపోయాడని తిరిగిరాడన్న బెంగతో జీవితంపై విరక్తి చెంది చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి చిన్న ముత్తన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు మృతదేహాన్ని పంచానామ చేసి పోస్టుమార్టం నిమిత్తం భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు తెలిపా

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News