Friday, December 20, 2024

ప్రపంచంతో పోటీపడే విద్యా విధానాన్ని తీసుకొస్తాం: భట్టి

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: ప్రపంచంతో పోటీపడే విద్యా విధానాన్ని తీసుకొస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఈ ఏడాది సమీకృత గురుకులాలకు ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. సంకల్పం, చిత్తశుద్ధి ఉంటే సాధ్యం కానిదేది లేదన్నారు. ఖమ్మంలో యంగ్ ఇండియా సమీకృత గురుకుల పాఠశాలకు భట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. వచ్చే విద్యా సంవత్సరానికి గురుకుల భవనాలు పూర్తి కావాలని, గురుకుల పాఠశాలల్లో సకల సౌకర్యాలు పొందుపరుస్తున్నామని, ప్రభుత్వ విద్యా విధానం నిర్వీర్యం కాకుండా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ విద్యా సంస్థలు విద్యుత్ బిల్లులు కట్టనక్కర్లేదని, విద్యా సంస్థల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తుందని భట్టి పేర్కొన్నారు. కుల, మతాలకు అతీతంగా అందరినీ కలుపుకుని ముందుకెళ్తున్నామని, అన్ని వర్గాల కోసం విద్యాబుద్ధులు నేర్పేందుకు నాంది పలికామని, విద్యా, వైద్యానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని, విద్యా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకవస్తామని హామీ ఇచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News