- Advertisement -
హైదరాబాద్: తనకు మధిర నియోజకవర్గం ఎంత ఇష్టమో…మంచిర్యాల కూడా అంతే ఇష్టమని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. మంచిర్యాల ఎమ్ఎల్ఎ ప్రేమ్ సాగర్ రావుతో మంచి అనుబంధం ఉందని అన్నారు. ఈ సందర్భంగా భట్టి మీడియాతో మాట్లాడుతూ..మంచిర్యాల అభివృద్ధి కోసం రూ.1200 కోట్ల నిధులు కేటాయించామని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూల్స్ 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా స్కూళ్ల నిర్మాణం జరుగుతుందని తెలియజేశారు. రూ.300 కోట్లతో మంచిర్యాలలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామని, రాళ్ల వాగు నుంచి గోదావరి పరిసరాలు…ముంపునకు గురికాకుండా రూ.260 కోట్లతో రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేస్తామని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
- Advertisement -