Monday, December 23, 2024

అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అతి త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. జాబ్ క్యాలెండర్ ద్వారా రాబోయే రోజుల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. శాసన సభలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశ పెట్టారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బిల్లుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడారు. యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ స్థాపనకు ప్రతిపాదిస్తున్నామని, రెండు లక్షల ఉద్యోగాలు కల్పించడంతో పాటు మరో 20 లక్షల మందికి ఉపాధి కోసం ప్రయత్నాలు చేస్తామన్నారు. ప్రభుత్వం పరంగా అందరికీ ఉద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యాలు గ్రాడ్యుయేట్లలో కొరవడ్డాయని, నైపుణ్యాల పెంపుపై పారిశ్రామికవేత్తలు, విసిలు, విద్యార్థులతో చర్చలు జరిపామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News