Tuesday, December 17, 2024

భారతీయ యువతి అమెరికాలో అనుమానాస్పద మృతి

- Advertisement -
- Advertisement -

హుస్టన్ : భారతీయ సంతతి అమెరికన్ పాతికేళ్ల యువతి లహరి ప్రతివాద అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. టెక్సాస్ రాష్ట్రం నుంచి ఈ యువతి ఈ నెల ఆరంభంలో కన్పించకుండా పొయ్యారు. ఇప్పుడు ఆమె హుస్టన్‌కు 322 కిలోమీటర్ల దూరంలోని ఒక్లాహోమ్ స్టేట్‌లో చనిపోయి ఉన్నట్లు గుర్తించారు. చివరి సారిగా ఆమె నల్లటి టయోటా కారులో మెక్ కిన్నె సబర్బ్ ప్రాంతానికి కార్యాలయానికి వెళ్లుతుండగా డల్లాస్ శివార్లలో కన్పించింది.

కుటుంబ సభ్యులు ఆమె కన్పించడం లేదని ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి, గాలింపు చర్యలు చేపట్టారు. ప్రతివాద ఓవర్లాండ్ పార్క్ రీజినల్ మెడికల్ సెంటర్‌లో ఉద్యోగినిగా ఉన్నారు. ఆమె తరచూ వినోదాత్మక కార్యక్రమాలకు వెళ్లుతూ ఉండేవారని , ఈ క్రమంలోనే దారుణం జరిగి ఉంటుందని తేల్చారు. అయితే ఇది ఎటువంటి మరణం అనేది నిర్థారణ కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News