Wednesday, January 22, 2025

స్నేహితుడే కదా అని ఇంట్లోకి రానిస్తే..

- Advertisement -
- Advertisement -

జనగామ : జనగామ పట్టణం భవాని నగర్‌లో నివాసముంటున్న బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన సందెల రాజేష్ తన స్నేహితుడైన వంశీ ఇంట్లో చోరీకి పాల్పడగా పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే..బచ్చన్నపేటకు చెందిన సందెన నాగేష్ కుమారుడు రాజేష్ (26) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. మద్యం వ్యసనానికి బానిసై డబ్బు సరిపోక దొంగతనాన్ని ఎంచుకున్నాడు. ఈ క్రమంలోనే ఈనెల 9న ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళం వేసి ఉన్న తన స్నేహితుడైన వంశీ ఇంట్లోకి చొరబడి రూ.10లక్షలు చోరీకి పాల్పడ్డాడు.

కాగా విశ్వసనీయ సమాచారం మేరకు జనగామ బస్టాండ్ ప్రాంతంలో తిరుగుతున్న రాజేష్‌ను పట్టుకొని విచారించగా అతని నేరాన్ని అంగీకరించాడు. తన వద్ద ఉన్న బ్యాగ్‌లోని రూ.10లక్షల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా నిందితుడిని పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన ఏసీపీ దేవేందర్‌రెడ్డి, నర్మెట సీఐ పి.నాగబాబు, జనగామ ఎస్సై ఇ.శ్రీనివాస్, ఎస్సైలు సీహెచ్.రఘుపతి, వెస్ట్‌జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి.సీతారాం అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News