Thursday, January 23, 2025

అత్యాచారం కేసులో యువకుడికి 20సంవత్సరాల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

నేరెడుచర్ల ః మైనర్ బాలికపై అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడికి 20సంవత్సరాలు జైలు శిక్షతో పాటు రూ.10వేలు జరిమానా విధిస్తున్నట్లు జిల్లా సెషన్స్‌కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కేవలం సంవత్సర కాలంలోనే కేసును విచారణ జరిపి సాక్షులను బాదితులను విచారించి నిందితుడికి జైలు శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ సిబ్బందిని కోదాడ డీఎస్పీ , హుజూర్‌నగర్ సీఐ రామలింగారెడ్డి,నేరెడుచర్ల ఎస్సై నవీన్‌కుమార్,కోర్టు డ్యూటీ పోలీసులను జిల్లా ఎస్పీ రాజేంద్రపప్రసాద్ అభినందించారు.
నేరెడుచర్ల మండల కేంద్రంలో 7-1-2022వ తేదీన మైనర్ బాలికపై అత్యాచారం జరిగిందని బాధితురాలి తల్లి నేరెడుచర్ల పోలీస్‌స్టేషన్‌లో పిర్యాదు చేసింది. పిర్యాదు మేరకు నేరెడుచర్ల మండల కేంద్రానికి చెందిన ఒంటిపులి కోటేశ్వర్‌రావు(27) ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించి నేరెడుచర్ల పోలీస్ స్టేషన్‌లో ఫోక్సో చట్టం 2012లో ,ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం 1989ప్రకారం నేరం సంఖ్య10/2022 ప్రకారం నిందితుడిపై కేసు నమోదు చేశారు.

ఈఘటనపై దర్యాప్తు అధికారులు అప్పటి కోదాడ డీఎస్పీ రఘు,నేరెడుచర్ల ఎస్సై నవీన్‌కుమార్‌లు విచారణ జరిపి నేరాభియోగ పత్రాలను కోర్టుకు దాఖలు చేశారు.దీనిపై పూర్తి సాక్షాదారాల ప్రకారం సాక్షులను,బాదితులను విచారించిన 1వ అదనపు సెషన్ జిల్లా కోర్టు న్యాయమూర్తి ప్రేమలత నిందితుడు వంటిపులి కోటేశ్వరరావు నేరానికి పాల్పడినట్లు నిర్దారించి నేరస్ధునికి 20సంవత్సరాలు జైలుశిక్ష,రూ.పదివేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు.నేరాలకు పాల్పడితే ఏనాటికైనా చట్టపరమైన శిక్షలు తప్పవని ఎస్పీ రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు.రాష్ట్ర పోలీస్‌శాఖలో అమలవుతున్న కోర్టు డ్యూటీ ఫంక్షనల్ వర్టికల్ ఆధారంగా సిబ్బంది సామర్ధంతో పనిచేసి అతితక్కువ కాలంలోనే ఈకేసును చేదించి నేరస్ధుడిని శిక్ష పడేలా కృషి చేయడం అభినందనీయమన్నారు.బాదితురాలికి న్యాయం చేయడం జరిగిందని, బాదితురాలిని భరోసా సెంటర్ నందు నైతికంగా, సామాజికంగా,మానసికంగా కౌన్సిలింగ్ నిర్వహించి భరోసా కల్పించారు.

ప్రభుత్వం నుండి మంజూరైన రూ.ఆరు లక్షల ఎక్స్‌గ్రేషియా అందించారు. ఈ కేసులో బాగా పనిచేసిన కోదాడ డీఎస్పీ వెంకటేశ్వరెడ్డి, సీఐ రామలింగారెడ్డి,నేరెడుచర్ల ఎస్సై నవీన్‌కుమార్‌ను,కోర్టు పీపీ త్యాగరాజు,కోర్టు డ్యూటీ సిబ్బందిని,నేరెడుచర్ల పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News